మాజీ ప్రేయసితో నికోలస్ కేజ్ శృంగార ఫోటోలు అపహరణ
ఇంట్లో దొంగలు పడితే సాధారణంగా వస్తువులు, డబ్బుల్ని ఎత్తుకెళ్లుతారు. కాని హలీవుడ్ స్టార్ క్రిస్టియానా ఫుల్టన్ ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయింది వస్తువులను, సొమ్ములను కానేకాదు. దొంగల్లో కూడా శృంగార ప్రియులు ఉన్నారేమో.. తన మాజీ ప్రియుడు నికొలాస్ కేజ్ తో క్రిస్టియానా ఫుల్టాన్ దిగిన ఎక్స్ రేటేడ్ (అత్యంత శృంగారభరితమైనవి) ఫోటోలను ఎత్తుకెళ్లారట.
ఎంతో ఇష్టంగా దాచుకున్న మాజీ ప్రేయసి జ్క్షాపకాలను దొంగలు ఎత్తుకుపోవడంపై హాలీవుడ్ స్టార్ గొల్లుమంటున్నాడు. ఫుల్టన్ ఇంట్లోకి దూరి నాలుగు కంప్యూటర్లను, నాలుగు ఫోటో బాక్సులను అపహరించుకుపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఈ నేరంలో రికార్డో ఓరాజ్కో అనే వ్యక్తిని పోలీసుల అరెస్ట్ చేశారు. అయితే అపహరణకు గురైన పోటోలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.