
లావణ్యా త్రిపాఠి, నిఖిల్
నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. టీఎన్ సంతోష్ దర్శకుడు. బి. మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జర్నలిస్ట్ అర్జున్ సురవరం పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ బాగా నటించారు. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. స్యామ్ సీఎస్ అందించిన సంగీతం ఓ హైలైట్. సినిమాను మార్చి 29న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తమిళ హిట్ ‘కణిదన్’ చిత్రానికి ‘అర్జున్ సురవరం’ తెలుగు రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment