పార్టీకి డేట్‌ ఫిక్స్‌ | Nikhil Siddharth starrer Kirrak Party to release on 9th February 2018 | Sakshi
Sakshi News home page

పార్టీకి డేట్‌ ఫిక్స్‌

Published Sun, Dec 10 2017 1:47 AM | Last Updated on Sun, Dec 10 2017 1:47 AM

Nikhil Siddharth starrer Kirrak Party to release on 9th February 2018 - Sakshi

పార్టీ చేసుకుందాం రండి అంటున్నారు హీరో నిఖిల్‌. పార్టీ అంటే అలా ఇలా కాదు కిర్రాక్‌గా ఉండాలి అట. ఇంతకీ ఆ పార్టీ ఎప్పుడు? ఎక్కడ? అనుకుంటున్నారా? ఫిబ్రవరి 9న పార్టీ షురూ. నిఖిల్‌ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కిర్రాక్‌  పార్టీ’. కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ ‘కిరిక్‌ పార్టీ’కు ఇది రీమేక్‌. సంయుక్త హెగ్డే, సిమ్రాన్‌ పరీంజా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా అనిల్‌ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. చిత్రనిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ– ‘‘షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రాజమండ్రిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. హ్యాపీడేస్‌’ తరువాత నిఖిల్‌ చేస్తోన్న  పూర్తి స్థాయి కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా ఇది. నిఖిల్‌ మ్యాచో లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. గతంలో నిఖిల్‌కు సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన దర్శకులు సుధీర్‌ వర్మ, చందు మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే మరియు డైలాగులను అందిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్నాథ్, సహ నిర్మాతలు: అజయ్‌ సంకర, అభిషేక్‌ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిషోర్‌ గరికపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement