మరో ఆసక్తికర పాత్రలో నిత్య | Nitya menon in Nizar Shafi Debut Movie | Sakshi
Sakshi News home page

మరో ఆసక్తికర పాత్రలో నిత్య

Published Tue, Jan 9 2018 10:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

Nitya menon in Nizar Shafi Debut Movie - Sakshi

కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్. ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న అ! సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమా తరువాత బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఓ ఆసక్తికర చిత్రంలో నటించేందుకు అంగీకరించింది.

సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమాలో నిత్యమీనన్ కీలక పాత్ర పోషించనుందట. ముందుగా ఈ పాత్రకు అంజలిని తీసుకున్నారన్న ప్రచారం జరిగినా.. చిత్రయూనిట్ నిత్య మీనన్ రను తీసకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ విన్న నిత్య, ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. నలుగురు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అనీషా ఆంబ్రోస్, అదితి ఆర్య, నందిత శ్వేతలు నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement