
బాలీవుడ్ ప్రేమికులు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్‌ల నిశ్చితార్థం అయ్యిందా? లేదా? బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ నెల 5న దీపిక పుట్టినరోజున శ్రీలంకలో వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. దీంతో అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ వీరి నిశ్చితార్థంపై క్రేజ్ నెలకొంది. ఐదో తారీఖు వచ్చింది.. వెళ్లింది. అయినా వీరి ఎంగేజ్‌మెంట్ గురించి ఇప్పటివరకూ ఒక్క వార్త, ఫొటో కూడా బయటకు రాలేదు.
తాజా సమాచారం ఏంటంటే.. దీపిక తన 32వ పుట్టినరోజును రణ్‌వీర్ సింగ్, అతని కుటుంబ సభ్యులతో శ్రీలకంలో జరుపుకున్నారట. ఈ సందర్భంగా తమకు కాబోయే కోడలికి రణ్‌వీర్ తల్లిదండ్రులు అంజు భవాని, జగ్జీత్ సింగ్ ఖరీదైన వజ్రాల హారం బహుకరించారట. అలాగే ప్రముఖ డిజైనర్ సబ్యసాచితో ప్రత్యేకంగా చీర తయారు చేయించి, కాబోయే కోడలికి ఇచ్చారని టాక్. కాబోయే అత్తమామలు ఇచ్చిన గిఫ్ట్స్ దీపికకు భలేగా నచ్చేశాయట. ఇదిలా ఉంటే శ్రీలంకలో దీపిక బర్త్‌డే మాత్రమే జరిగిందనీ, ఎంగేజ్‌మెంట్ జరగలేదని కొందరు అంటుంటే.. సీక్రెట్‌గా రణ్‌వీర్–దీపిక రింగులు మార్చుకున్నా రని మరికొందరు అంటున్నారు. మరి ఏది నిజం? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment