బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ దీపికా పదుకోన్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట నిశ్చితార్థం ఇటీవల జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 5న దీపిక పుట్టినరోజు. అయితే వీరు పుట్టిన రోజు వేడుకను మాల్దీవుల్లో చేసుకున్నారని కొందరు, శ్రీలంకలో జరుపుకున్నారని మరికొందరు అంటున్నారు. ఎక్కడ జరుపుకున్నారన్నది స్పష్టత లేకపోయినా.. ముంబయి ఎయిర్‌పోర్టులో మాత్రం చేతిలో చేయి వేసుకుని నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.
గత శుక్రవారం(5వ తేది) దీపిక పుట్టిన రోజును రణ్‌వీర్ స్పెషల్‌గా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపికకు రణ్‌వీర్ సింగ్ డైమండ్ నెక్లెస్, డిజైనర్ చీరను బహుమతిగా అందించి, కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరువురు రింగులు మార్చుకున్నట్లు సమాచారం. దీపిక తండ్రి ప్రకాష్ చెబుతున్న మాటలు వింటే నిశ్చితార్ధం అయినట్లు తెలుస్తోంది. "వాళ్లిద్దరూ మేజర్స్. ఏం చేస్తున్నారో వాళ్లకు తెలుసు. నేను దీపికకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఆమె నిర్ణయం ఆమె ఇష్టం" అని ప్రకాష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment