రేఖతో కలిసి సినిమా చేయట్లేదు: అమితాబ్ | Not working with Rekha, says amitabh bachchan | Sakshi
Sakshi News home page

రేఖతో కలిసి సినిమా చేయట్లేదు: అమితాబ్

Published Mon, Dec 9 2013 1:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రేఖతో కలిసి సినిమా చేయట్లేదు: అమితాబ్ - Sakshi

రేఖతో కలిసి సినిమా చేయట్లేదు: అమితాబ్

అమితాబ్ - రేఖ అంటే అదో అద్భుతమైన క్రేజీ కాంబినేషన్. వాళ్లిద్దరూ మళ్లీ సినిమాల్లో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? కానీ, ఈ విషయాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఖండించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ తదుపరి ప్రాజెక్టులో తాను రేఖతో కలిసి నటిస్తున్నానంటూ వచ్చిన కథనాలు తప్పని ఆయన చెప్పారు. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తారని, అందుకు చర్చలు సాగుతున్నాయని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. తాను ఆ సినిమాలో నటించడంలేదని, యశ్ రాజ్ ఫిల్మ్స్లో ఎవరైనా తెలిస్తే తన పేరు కాస్త చెప్పాలంటూ విలేకరులతో సరదాగా అన్నారు.

తాను కూడా ఆ కథనాలు చదివాను గానీ అవి సరికాదని అమితాబ్ చెప్పారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రూపొందిన 'సిల్సిలా' చిత్రంలోనే అమితాబ్, రేఖ చిట్టచివరి సారిగా కలిసి నటించారు. జయాబచ్చన్, శశికపూర్ కూడా నటించిన ఈ సినిమా 1981లో విడుదలైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. ప్రస్తుతం అమితాబ్ 'భూత్నాథ్ 2' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. అలాగే సంజయ్ దత్ ప్రొడక్షన్స్ తీస్తున్న 'హస్ముఖ్ పిఘల్ గయా' చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement