
యంగ్ టీమ్ చేసిన లవ్లీ మూవీ
ప్రచార చిత్రాలు, పాటలు చాలా బాగున్నాయి. రంజిత్ నా కుటుంబ సభ్యుడు. యంగ్ టీమ్ చేసిన ఈ లవ్లీ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’
‘‘ప్రచార చిత్రాలు, పాటలు చాలా బాగున్నాయి. రంజిత్ నా కుటుంబ సభ్యుడు. యంగ్ టీమ్ చేసిన ఈ లవ్లీ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రంజిత్, సన జంటగా పి. నరసింహారెడ్డి దర్శకత్వంలో జి. కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘నువ్వు నేను ఒకటవుదాం’. రామ్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని బొత్స సత్యనారాయణ ఆవిష్కరించి, తన శ్రీమతి బొత్స ఝాన్సీకి ఇచ్చారు.
ఈ వేడుకలో కారుమూరు నాగేశ్వరరావు, బీవీయస్‌యన్ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రమేశ్ పుప్పాల, నాగశౌర్య తదితరులు పాల్గొన్నారు. టీజర్‌ను కార్తీక్, సుధాకర్, ప్రచార చిత్రాన్ని నాగశౌర్య ఆవిష్కరించారు. రంజిత్ మంచి హీరోగా ఎదుగుతాడని ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘రంజిత్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. పాటలు, చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇది కలర్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు చెప్పారు. రంజిత్ మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిది. సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు.