మరోసారి పోలీస్ అధికారిగా కార్తీ
సినిమాలపై టైటిల్స్ ప్రభావం చాలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు తోళా అంటూ నాగార్జునతో కలిసి పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు కార్తీ ఇటీవల కాషో్మరాగా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించారు. ఇలా విజయపథంలో పయనిస్తున్న కార్తీ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై అంటూ రొమాంటిక్ పాత్రలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు తదుపరి చిత్రానికీ సన్నద్ధం అవుతున్నారు. కాషో్మరా చిత్ర నిర్మాతలకే మరో అవకాశం ఇచ్చారు. ఆ నిర్మాతలు ఈ సారి మరో పవర్ఫుల్ పాత్రలో కార్తీని చూపించడానికి రెడీ అవుతున్నారు.దీనికి అప్పుడే పేరును కూడా ఖరారు చేశారండి. ఆ పేరు వింటేనే కార్తీ పాత్ర పవర్ ఏరేంజ్‌లో ఉంటుందో అర్థమైపోతుంది.
అదే ధీరన్ అధికారం ఒండ్రు. ఇంతకీ ఈ చిత్రంలో కార్తీ పోషించే పాత్ర ఏమిటనేగా మీ ఆసక్తి. పవర్ అనగానే అర్థం అయ్యే ఉంటుందే. అవునండీ కార్తీ ఈ చిత్రం ద్వారా మరోసారి కాకీ దుస్తుల్లో రఫ్ఫాడించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సాధారణంగా విలన్ల భరతం పట్టే ఆషామాషీ కథా చిత్రం కాదని నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు అన్నారు. ఒక నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కినున్న చిత్రం ధీరన్ఆధికారం ఒండ్రు అట. ఇందులో కార్తీ పేరు ధీరన్. ఇందు కోసం కార్తీ ఇప్పటికే చాలా కిలోల బరువు తగ్గారట. ఇంతకీ ఈయనతో రొమాన్స్ చేసే నాయకి ఎవరనుకుంటున్నారూ.. టాలీవుడ్లో టాప్ రేంజ్లో వెలిగిపోతున్న రకుల్ ప్రీతిసింగ్నే. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్ కొత్త సంవత్సరం తొలి నెలలోనే ప్రారంభం కానుంది. ఇంతకు ముందు చిరుతై చిత్రంలో పోలీస్ అధికారిగా దుమ్మురేపిన కార్తీ మరో సారి కాకీ పవర్‌ను చూపించనున్నారన్న మాట.