మెగాఫోన్ పట్టనున్న రసూల్!
ఆస్కార్లు గెలుచుకున్న భారతీయ సౌండ్ ఇంజనీర్ రసూల్ పుకుట్టి. ఆ తర్వాత ఆయన పేరు దేశవిదేశాల్లో మార్మోగిపోయి, ఫుల్ బిజీ అయిపోయారు. తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. ఇటీవలే తన సొంత సినీ నిర్మాణ సంస్థ లీ పెంటా ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించారు. దీని గురించి ఆయన చెబుతూ-‘‘ అన్నీ అనుకున్నట్టు జరిగితే నా మొదటి సినిమానే బాలీవుడ్‌లో చేయబోతున్నాను. ఇక నా మాతృభాష మలయాళంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా చేస్తాను. దర్శకునిగా, నిర్మాతగా, సౌండ్ ఇంజనీర్‌గా ఇక నుంచి మూడు పాత్రలు పోషించనున్నాను’’ అన్నారు.