పార్టీ చేసుకున్నారు! | Party With Chaitanya, Akhil and Nagarjuna | Sakshi
Sakshi News home page

పార్టీ చేసుకున్నారు!

Published Sun, Dec 11 2016 11:19 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

పార్టీ చేసుకున్నారు! - Sakshi

పార్టీ చేసుకున్నారు!

చైతూ చేతిలో గ్లాసు... వెనుక తమ్ముడు అఖిల్ ముఖంలో ఫుల్ జోష్... ఈ ఇద్దరు కుమారులతో తండ్రి అక్కినేని నాగార్జున ఇచ్చిన పోజు... భలే ఉంది కదూ! కింగ్ నాగ్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ ఫొటోను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ నెల 9న (శుక్రవారం) అఖిల్, శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. శనివారం చలన చిత్ర ప్రముఖులకు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చిందట! బహుశా.. ఇది అఖిల్ బ్యాచిలర్స్ పార్టీ అనుకోవాలేమో! ఆ పార్టీలో దిగిన ఫొటోనే ఇదని సమాచారం. ‘ఐ హ్యాడ్ గ్రేట్ ఈవెనింగ్ విత్ మై బాయ్స్’ అని నాగార్జున సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement