జూలై 14న వస్తున్న 'పటేల్ సార్' | Patel SIR Releasing On July 14th | Sakshi
Sakshi News home page

జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'

Published Thu, Jul 6 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'

జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'

వారాహి చలనచిత్రం బ్యానర్లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా 'పటేల్ సార్'. జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి శివాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టీజర్ను విడుదల చేశారు.

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. 'యూట్యూబ్లో విడుదల చేసిన టీజర్ తోనే 'పటేల్ సార్' సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకొంది. జగపతిబాబు సపోర్ట్ లేకపోతే సినిమా అవుట్ పుట్ ఈరేంజ్లో వచ్చేది కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జగపతిబాబు యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్, కథ, స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాను జులై 14న విడుదల చేస్తున్నాం. పటేల్ సర్ ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది'  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement