Patel SIR
-
'పటేల్ సర్' మూవీ రివ్యూ
టైటిల్ : పటేల్ సర్ జానర్ : రివేంజ్ డ్రామా తారాగణం : జగపతిబాబు, పద్మప్రియా, తాన్య హోపే, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్ సంగీతం : డీజే వసంత్ దర్శకత్వం : వాసు పరిమి నిర్మాత : సాయి కొర్రపాటి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశాలతో ఫుల్ బిజీగా ఉన్న జగపతిబాబు, మరోసారి హీరోగా చేసిన ప్రయత్నమే పటేల్ సర్. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా తన వయసుకు తగ్గ రివేంజ్ డ్రామాను ఎంచుకున్న జగపతి బాబు.. లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. మరి ఈ పటేల్ సర్, జగపతిబాబుకు హీరోగా హిట్ ఇచ్చిందా..? వారాహి చలనచిత్రం బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాగా పటేల్ సర్ ప్రూవ్ చేసుకుందా..? కథ : దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ దుహాన్ సింగ్) తన తమ్ముడు కన్నా తయారు చేసిన సింథటిక్ డ్రగ్ ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం తన ఫ్రెండ్స్ మౌంటీ(పృథ్వీ), ఛోర్ బజార్ లాలా( కాలకేయ ప్రభాకర్)లతో కలిసి భారీ స్కెచ్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ రవి ఎలాగైన డీఆర్ గ్యాంగ్ ను పట్టించాలని సాక్ష్యాధారాలు రెడీ చేస్తాడు. ఈ లోగా విషయం తెలుసుకున్న డీఆర్, రవిని చంపేస్తాడు. రవి చనిపోయిన కొద్ది రోజుల తరువాత డీఆర్ గ్యాంగ్ లోని చోర్ బజార్ లాలాను అరవైయ్యేళ్ల ముసలాడు పటేల్ సర్(జగపతి బాబు) వేటాడి వేటాడి రాక్షసంగా చంపేస్తాడు. హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకున్న డీఆర్, మినిస్టర్ పాపారావు(రఘుబాబు) సాయంతో లంచాలకు అలవాటు పడ్డ పోలీస్ ఆఫీసర్ కేథరిన్(తాన్యా హోపే)ను ఇన్వస్టిగేషన్ ఆఫీసర్‌గా అపాయింట్ చేయిస్తాడు. పోలీస్ ఇన్వస్టిగేషన్ జరుగుతుండగానే డీఆర్ తమ్ముడితో సహా మౌంటి కూడా పటేల్ సర్ చేతిలో హత్యకు గురవుతారు. అసలు పటేల్ సర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? పటేల్ తో పాటు ఉన్న చిన్న పాప యామిని (బేబీ డాలీ) ఎవరు..? కేథరిన్ పటేల్ సర్ ను పట్టుకుందా..? చివరకు పటేల్ సర్ ఏమయ్యాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా జగపతి బాబు వన్ మేన్ షోలా నడిచింది. మిగతా పాత్రలన్నింటికీ స్క్రీన్ టైం చాలా తక్కువ. క్రూరంగా హత్యలు చేసే పటేల్ సర్ గా, అదే సమయంలో యంగ్ డాక్టర్ వల్లభ్ పటేల్ గా జగపతి బాబు నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లుక్స్ పరంగా జగపతి బాబు సూపర్బ్ అనిపించాడు.తనకు అలవాటైన స్టైలిష్ విలనిజంతో కబీర్ దుహన్ సింగ్ మరోసారి మెప్పించాడు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఆమని, పద్మప్రియ, పృథ్వీలు తమ స్థాయిక తగ్గ నటనతో పాత్రలకు న్యాయం చేశారు. బాహుబలి సినిమాలో కామెడీతో ఆకట్టుకున్న సుబ్బరాజు. ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించాడు. ఇతర పాత్రల్లో కాలకేయ ప్రభాకర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణ మురళీ ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాయిగా ఉన్న జగపతిబాబును మరోసారి హీరో పాత్రల వైపు తీసుకువచ్చిన దర్శకుడు వాసు పరిమి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మంచి కథతో పాటు జగపతిబాబు లాంటి నటుడు ఉన్నా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు. పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందించే ప్రయత్నంలో ఎమోషనల్ సీన్స్ కు అవకాశామున్నా అలాంటి సీన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. డీజే వసంత్ సంగీతం పరవాలేదు. మెలోడీ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరిస్తుంది. నిర్మాణ విలువలు వారాహి చలనచిత్రం బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా లేవు. ప్లస్ పాయింట్స్ : జగపతిబాబు నటన ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్స్ మైనస్ పాయింట్స్ : పూర్ టేకింగ్ క్వాలిటీ లేని గ్రాఫిక్స్ స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
హీరోగా చేయాలని చేసిన సినిమా కాదిది!
‘‘ఇప్పుడు పనిగట్టుకుని హీరోగా చేయాల్సిన అవసరం నాకు లేదు. స్క్రిప్ట్ నచ్చడంతో ‘పటేల్ సార్’ చేశా. డైరెక్టర్స్ ఛాలెంజిగ్ రోల్స్ ఆఫర్ చేస్తే ఆ కిక్కే వేరు. అలా కిక్ ఇచ్చే పాత్రలు చేయడం నాకిష్టం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు పెరుగుతున్నాయి. అందుకే సూపర్ స్క్రిప్ట్ అనిపిస్తేనే హీరోగా చేస్తా’’ అన్నారు జగపతిబాబు. వాసు పరిమి దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజినీ కొర్రపాటి నిర్మాతగా, సాయి కొర్రపాటి నిర్మాణసారథ్యంలో రూపొందిన ‘పటేల్ సార్’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. కొంత గ్యాప్ తర్వాత హీరోగా చేయడం, ఇతర విశేషాలను జగపతిబాబు ఈ విధంగా పంచుకున్నారు. ♦ ‘పటేల్ సార్’ పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా. నిజానికి లుక్ కుదిరితేనే చేద్దామనుకున్నా. అందుకే, ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోయా. సాయి కొర్రపాటిగారు నిర్మాత కావడంతో ఈ సినిమాకి బలం చేకూరింది. అందుకే ఈ సినిమాకి ఆయన ఫస్ట్ హీరో. యూనిట్లో ఉన్న 150 మందీ ఈ సినిమాకి హీరోలే. ∙ ♦ కొంతమంది డిస్టిబ్యూటర్స్, బయ్యర్స్ ఈ స్టోరీ లైన్ విని, సూపర్‌హిట్ సాధిస్తారని చెప్పారు. మలయాళంలో ‘పులి మురుగన్’ చేశాక అక్కడివాళ్లు నన్ను ‘డాడీ గిరిజా’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను ‘పటేల్ సార్’ అని పిలిస్తే, ఆశ్చర్యపోనక్కర్లేదు. ∙ ♦ ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసినవాళ్లల్లో కొందరు ఇది థ్రిల్లర్ సినిమానా లేక హర్రరా? అనుకునే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ డ్రామాలో నడిచే థ్రిల్లర్ మూవీ. రాజమౌళిగారు నిజానికి దగ్గరగా ఉండే మనిషి. అలాంటి ఆయన ఈ సినిమా గురించి ట్వీట్ చేశారంటే సినిమా ఎంత బాగుంటుందో ఉహించుకోవచ్చు. ♦ ‘పటేల్ సార్’ సూపర్‌హిట్ అవ్వకపోతే నిరుత్సాహపడతాను. ఈ సినిమాపై నాకంత నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకమూ ఉంది. ∙ ♦ రిచ్ బిజినెస్‌మేన్, రిచ్ ఫాదర్ క్యారెక్టర్స్ అంటే నేనే అన్నట్లుగా అయిపోయింది. అందుకే ‘పూర్ క్యారెక్టర్స్’ వస్తే బాగుంటుందనుకుంటున్నా. కొంతమంది అడగడానికి మొహమాటపడి నాదాకా రారు. ఎవరైనా వచ్చి నన్ను కలవొచ్చు. కథ నచ్చితే ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీ. ‘దంగల్’లో ఆమిర్‌ఖాన్ డిఫరెంట్ రోల్ ట్రై చేశారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి చేయబోతున్నా. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పుడు మాత్రం హీరో తర్వాత నాకు పేరు రావాలని ట్రై చేస్తాను. నేను ఎవరితోనూ పోటీపడను. నా 20 సినిమాలూ నాకుంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ∙ ♦ ‘సముద్రం’ అనే టెలీఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్తో లైఫ్ ఆగిపోదు. యూటర్న్ తీసుకుని ఎక్కడో ఒకచోట మళ్లీ మంచిగా ప్రారంభం కావాల్సిందే. అందుకు నా జీవితం ఓ ఉదాహరణ. అది కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలన్నది ఈ టెలీఫిల్మ్ ముఖ్యోద్దేశం. -
'పటేల్ సార్' వర్కింగ్ స్టిల్స్
-
జూలై 14న వస్తున్న 'పటేల్ సార్'
వారాహి చలనచిత్రం బ్యానర్లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా 'పటేల్ సార్'. జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి శివాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేశారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. 'యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్ తోనే 'పటేల్ సార్' సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకొంది. జగపతిబాబు సపోర్ట్ లేకపోతే సినిమా అవుట్ పుట్ ఈరేంజ్‌లో వచ్చేది కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి జగపతిబాబు యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్, కథ, స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాను జులై 14న విడుదల చేస్తున్నాం. పటేల్ సర్ ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది' అన్నారు.