యాక్షన్‌... కట్‌ | Peter Hein Entry in Direction Department Soon | Sakshi
Sakshi News home page

యాక్షన్‌... కట్‌

Published Wed, Sep 4 2019 9:03 AM | Last Updated on Wed, Sep 4 2019 9:03 AM

Peter Hein Entry in Direction Department Soon - Sakshi

వెండితెరపై హీరోలు విలన్లను రెచ్చిపోయి కొడుతుంటే అభిమానులకు అదో థ్రిల్‌. యాక్షన్‌ లవర్స్‌కి కూడా ఫైట్స్‌ అంటే ఇష్టమే. హీరోలతో ఇలా ఫైట్స్‌ చేయించే యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌లో పీటర్‌ హెయిన్స్‌ది ప్రత్యేక స్థానం. మురారి, అపరిచితుడు, గజిని, మగధీర, రోబో... ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా హీరోలతో యాక్షన్‌ చేయించిన పీటర్‌ ఇప్పుడు ‘యాక్షన్‌.. కట్‌’ అని చెప్పబోతున్నారు. డైరెక్టర్‌గా మారుతున్నారాయన. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై లక్ష్మీ, లక్ష్యం, రేసుగుర్రం, ముకుంద వంటి చిత్రాలను నిర్మించిన నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబి భవ్య సమర్పకురాలు. చిత్రవిశేషాలను నల్లమలుపు బుజ్జి చెబుతూ – ‘‘పీటర్‌ చెప్పిన కథ నచ్చింది. కథ టేకాఫ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ అద్భుతంగా ఉంది. దసరాకి లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement