అసాధారణ ప్రేమకథ | Post Production Process To Shivan Movie | Sakshi
Sakshi News home page

అసాధారణ ప్రేమకథ

Mar 3 2020 2:00 AM | Updated on Mar 3 2020 2:00 AM

Post Production Process To Shivan Movie - Sakshi

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్‌

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్‌. ‘ది ఫినామినల్‌ లవ్‌ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.ఆర్‌.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సంతోష్‌ రెడ్డి లింగాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘లవ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. యువతకి కావాల్సిన అంశాలతో పాటు మాస్‌ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, ట్రైలర్, లిరికల్‌ సాంగ్స్‌కు  మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీరన్, సంగీతం: సిద్ధార్ధ్‌ సదాశివుని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శంకర్‌ వంగూరి, సహ నిర్మాత: పున్న మురళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement