
అమెరికా యాత్రకు ప్రగ్యా
కంచె సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రగ్యా జైస్వాల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కంచె తరువాత ఓం నమో వేంకటేశాయా, గుంటూరోడు లాంటి సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఆ సినిమాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్న ప్రగ్యా అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అదే జోరులో ఇప్పుడు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్న ప్రగ్యాజైస్వాల్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు సైన్ చేసింది. హిట్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్న జి నాగేశ్వరరెడ్డి, మంచు విష్ణుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ప్రగ్యా. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.