ప్రేమంటే ఓ బాధ్యత! | premanjali movie | Sakshi
Sakshi News home page

ప్రేమంటే ఓ బాధ్యత!

Published Mon, Oct 26 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

ప్రేమంటే ఓ బాధ్యత!

ప్రేమంటే ఓ బాధ్యత!

లవ్ అంటే ఓ ఫ్యాషన్‌గా మారిపోయిన ఈ రోజుల్లో ప్రేమంటే బంధం మాత్రమే కాదు ఓ బాధ్యత కూడా అనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమాంజలి’. సుజయ్, శ్వేతానీల్ జంటగా ఆర్. వరణ్ దొర దర్శకత్వంలో ఆర్.వి. నారాయణరావు, ఆర్.బి. ఆర్య నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: పీజీ వర్ధన్, ఛాయాగ్రహణం: భాస్కర్ డోర్నాల.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement