
కబాలి-2కు సన్నాహాలు
కబాలి చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయా? ఆ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది చిత్ర వర్గాల నుంచి.కబాలి ఈ టైటిల్ వినగానే గుర్తుకొచ్చే ఏకై క నటుడు సూపర్‌స్టార్‌నే.ఆరు పదుల వయసులో ఆయన నటించిన మరో గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం కబాలి.రజనీకాంత్ బాణీకి కాస్త భిన్నంగా ఎలాంటి పంచ్‌డైలాగ్‌సకు ఆస్కారం లేకుండా చిన్న చిన్న రజనీ తరహా స్టరుుల్స్‌తో తెరకెక్కిన చిత్రం ఇది. అపార విజయం సాధించిన కబాలి చిత్రానికి మూల కర్త రజనీకాంత్ కాగా, కర్మ, క్రియలు నిర్మాత కలైపులి.ఎస్.థాను, దర్శకుడు పా.రంజిత్. థాను తన చిరకాల మిత్రుడు రజనీకాంత్‌తో సుధీర్ఘ కాలం తరువాత నిర్మించిన చిత్రం కబాలి.ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి చిత్రంగా కబాలి రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
కాగా దీనికి సీక్వెల్‌గా రజనీకంత్, పా.రంజిత్ కాంబినేషన్‌లో నటుడు ధనుష్ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కథను సిద్ధం చేసే పనిలో దర్శకుడు నిమగ్నమై ఉన్నారు. తాజా సమాచారాన్ని బట్టి అది కబాలి చిత్రానికి సీక్వెల్ కాదని తెలుస్తోంది.కారణం కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను శనివారం కబాలి 2 టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం.అరుుతే ఆయన నిర్మించనున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ నటిస్తారా?పా.రంజిత్‌నే దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.