ప్రతినాయకి ఆశ | Priyamani dreams comedy heroine role | Sakshi
Sakshi News home page

ప్రతినాయకి ఆశ

Published Tue, Feb 2 2016 2:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

ప్రతినాయకి ఆశ - Sakshi

ప్రతినాయకి ఆశ

కథానాయకిగా సరుకు అయిపోతే ప్రతినాయకిగా సత్తా చాటాలని ఆశ పడే నటీమణుల పట్టికలో తాజాగా ప్రియమణి చేరారు. హీరోయిన్‌గా పలు భాషలలో పలు చిత్రాలు చేసిన నటి ప్రియమణి. కన్నాల్ ఖైదుచెయ్ చిత్రం ద్వారా భారతీరాజా పరిచయం దిగుమతి చేసిన మలయాళ భామ ప్రియమణి. ఆ చిత్రం చెయ్యి అందియ్యకున్నా కార్తీతో రొమాన్స్ చేసిన పరుత్తివీరన్ అమ్మడిని జాతీయ అవార్డును గెలుచుకునే స్థాయికి తీసుకెళ్లింది. ఆ తరువాత తెలుగు, మలయాళం, కన్నడం అంటూ చక్కర్లు కొట్టిన ప్రియమణికి ప్రస్తుతం జోరు తగ్గింది.

నిజం చెప్పాలంటే ఏ భాషలోనూ సరైన అవకాశాలు లేవు. అయితే ఈ ఇషయాన్ని ప్రియమణి అంగీకరించరు. తాను రోజుకు రెండు, మూడు కథలు వింటున్నాననీ, అయితే పాత్ర నచ్చితేనే నటించాలని నిర్ణయించుకున్నట్లు డాబులు చెప్పుకుంటున్నారు. కథానాయకిగా అన్ని రకాల పాత్రలు చేశాననీ, అయితే కామెడీ హీరోయిన్‌గా నటించాలని ఆశగా ఉందని ఇటీవల ఒక బేటీలో పేర్కొనడం గమనార్హం. అదే విధంగా పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతినాయకి పాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ బ్యూటీకి దర్శకత్వం చేపట్టాలనే ఆకాంక్ష ఉందట. త్వరలో అది నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రియమణి ఖండిచారు. తనకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని అన్న మాట నిజమే గానీ ఇప్పట్లో ఆ ఆలోచన లేదన్నారు. దర్శకత్వం అన్నది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం అనీ ప్రస్తుతం తాను మలయాళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాననీ చెప్పుకొచ్చారీ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement