ఫ్యాన్ కథపై ముదురుతున్న వివాదం
ఫ్యాన్ కథపై ముదురుతున్న వివాదం
Published Wed, Apr 13 2016 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ఫ్యాన్. షారూఖ్, స్టార్ హీరోగా, అతని వీరాభిమానిగా రెండు విభిన్న పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కథపై వివాదం రేగుతోంది. అభినేత అనే తన కథను ఫ్యాన్ సినిమాగా రూపొందించారంటూ చాలా రోజుల క్రితమే ఆరోపించారు తమిళ నిర్మాత మహేష్ థోయ్. ఆ కథను తమిళ రైటర్స్ అసోసియేషన్లో 1997లోనే రిజిస్టర్ చేసినట్టుగా చెపుతున్నారు.
ఇప్పుడు అదే కథను తన అనుమతి లేకుండా షారూఖ్, మనీష్ శర్మలు ఫ్యాన్ సినిమాగా తెరకెక్కించారని. ఇందుకు గాను తనకు 25 కోట్లు చెల్లించాలంటూ కేసు వేశారు. అయితే మనీష్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ఫ్యాన్, తను షారూఖ్ కోసం స్వయంగా తయారు చేసిన కథ అని చెపుతున్నారు. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి వివాదాలు కనిపించేవి ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇదే తరహా వివాదం రావటంతో ఫ్యాన్ సినిమా రిలీజ్పై సందిగ్థత ఏర్పాడింది.
Advertisement
Advertisement