ఆత్మీయ కలయిక
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత అ భిమానమో, గౌరవమో తెలిసిందే. అదే విధంగా రజనీ కాంత్‌కు లారెన్స్ అంటే ప్రత్యేక అభిమానం. వీరిద్దరూ శ్రీరాఘవేంద్రస్వామి పరమ భక్తులేనన్నది గమనార్హం. లారెన్స్ ఏ కార్యం తలపెట్టినా ముందుగా రజనీకాంత్ కు తెలియజేస్తారు. తాజాగా ఆయన పి.వాసు దర్శకత్వంలో శివగంగ అనే చిత్రంలో నటిస్తున్నారు. శుక్రవారం రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలిసిన లారెన్స్ తన తాజా చిత్రం శివగంగ వివరాలను, తాను నిర్మిస్తున్న శ్రీగాయత్రిదేవి ఆలయం, తన తల్లి కోసం కట్టిస్తున్న గుడికి సంబంధించిన విషయాలను వివరించి రజనీకాంత్ ఆశీస్సులు అందుకున్నారు.