
మరోసారి అతిథి పాత్రలో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాల ఎంపికలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే మంచి సక్సెస్ రేట్తో వరుస సక్సెస్ లతో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, వరుసగా అతిథి పాత్రలకు ఓకె చెప్పేస్తున్నాడు. ఇటీవల విడుదలైన నాని మజ్ను సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు రాజ్ తరుణ్.
తాజాగా మరో సినిమాలో అతిథి పాత్రకు ఓకె చెప్పాడు ఈ యంగ్ హీరో. తనతో సినిమా చూపిస్తా మామ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా రూపొందించిన బెక్కం వేణుగోపాల్ తొలిసారిగా నిర్మిస్తున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.