చరణ్ కొత్త సినిమా మొదలైంది | Ram Charan Next movie with Boyapati Srinu | Sakshi
Sakshi News home page

చరణ్ కొత్త సినిమా మొదలైంది

Published Fri, Nov 24 2017 12:46 PM | Last Updated on Fri, Nov 24 2017 12:47 PM

Ram Charan Next movie with Boyapati Srinu - Sakshi - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ జానర్ లో సరికొత్త ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ తదుపరి చిత్రం చేయనున్నాడు.

ఈ సినిమా ఈ రోజు(శుక్రవారం) లాంచనంగా ప్రారంభమైంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాలు చేసిన చరణ్ తన నెక్ట్స్ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో కలిసి  రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు కూడా ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement