తాను తాజాగా తెరకెక్కించిన ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ సినిమా ట్రైలర్ లీకైందని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వెల్లడించారు. దీని వెనుక తన ఆఫీస్ స్టాఫ్ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను వీక్షించేందుకు డబ్బు చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఏదేమైనా తాను ఇప్పుడు ఏం చేయలేనని, యూట్యూబ్‌లో హై రిజల్యూషన్ వర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేయడమే తన ముందున్న మార్గమని పేర్కొంటూ ట్రైలర్ రిలీజ్ చేశారు. అదే విధంగా ‘గడ్డి తింటావా సాంగ్’ 20 లక్షల వ్యూస్ సాధించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.(‘ఆర్జీవీపై ఇష్టంతో.. ఆ సినిమాకు నో చెప్పాను’)
కాగా అధికారికంగా ప్రకటించనప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుస పోస్టర్లు విడుదల చేస్తూ, గడ్డి తింటావా సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. ఇక‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో చూసేందుకు రూ.25 చెల్లించాలని ఆర్జీవీ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో.. ట్రైలర్ లీక్ అవడంతో డబ్బు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
POWER STAR trailer which was supposed to release at 11 AM today has leaked out ...we suspect that it is the work of one of our own office staff ..we take full responsibility and all people who paid for the trailer will be returned their money ASAP pic.twitter.com/jmcc7TpS1O
— Ram Gopal Varma (@RGVzoomin) July 22, 2020
Comments
Please login to add a commentAdd a comment