
'ఘాజీ'లో రానా లుక్
తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా.. ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నాడు. 1971లో భారత్, పాక్ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ద ఘాజీ ఎటాక్ సినిమాలో రానా నావెల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యుద్ధంలో ధ్వంసమయిన పిఎన్ఎస్ ఘాజీ సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పీవీపీ సినిమా బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో రానా లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ అయ్యింది. ఇటీవల టైటిల్ లోగోను విడుదల చేసిన చిత్రయూనిట్, తాజాగా నావెల్ ఆఫీసన్ యూనిఫాంలో ఉన్న రానా ఫోటోను విడుదల చేసింది.