ముంబై: విలక్షణ నటుడు, బాలీవుడ్ హీరో రణదీప్ హుడా సరభ్ జిత్ సింగ్ అవతారాన్ని ఇక చాలించాడట.. ఈ విషయాన్ని స్వయంగా రణదీప్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. తను నటిస్తున్నబయోపిక్ 'సరభ్ జిత్' లో సరబ్జిత్ సింగ్ అవతారానికి ఇక వీడ్కోలు చెప్పానన్నాడు. యాదార్ధ గాథ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో తన పాత్ర షూటింగ్ ముగిసిన సంకేతాలను అందించాడు. మీసాలు గడ్డంతో కాకుండా ఓ ఫ్రెష్ ఫోటో ఒకదాన్ని షేర్ చేశాడు. ఈ సందర్బంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ , సందీప్ సింగ్, రిచా చద్దా, ఐశ్వర్య రాయ్ సహా ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో పాటుగా ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
కాగా కండలు తిరిగిన దేహంతో ఫ్రెష్ గా కనిపించే రణదీప్ గత ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కోసం గెడ్డాన్ని పెంచాడు. అంతేకాదు ఛాలెంజింగ్ గా తీసుకున్న ఈ పాత్రకోసం బాగా బరువు తగ్గి ఎముకల గూడులా మారి అందరినీ ఆకట్టుకున్నాడు. హైవై సినిమాలో హర్యానీ యాస ద్వారా ఆకట్టుకున్న రణదీప్ హుడా, సరబ్జిత్ సింగ్ పాత్రలో పంజాబీ మాండలికాన్ని పరిపూర్ణంగా పలికించాడంటూ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. సోదరుడు సరభ్ జిత్ సింగ్ విడుదల కోసం పోరాడిన అక్క దల్బీర్ కౌర్ గా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, సరభ్ భార్యగా రిచా చద్దా నటించారు. మే 20 న ఈసినిమా థియేటర్లను పలకరించనున్నసంగతి తెలిసిందే.
Goodbye #Sarbjit.Gratitude to @OmungKumar @Vanita_ok @SandeepSinghOne @RichaChadda_ @kirandeohans #AishwaryaRai CREW pic.twitter.com/1tC4CiCwBN
— Randeep Hooda (@RandeepHooda) March 15, 2016