సినిమా కోసం గుండు కొట్టించుకోనున్నబాలీవుడ్ నటుడు | Ranveer Singh to go bald & learn Marathi for 'Bajirao Mastani' | Sakshi
Sakshi News home page

సినిమా కోసం గుండు కొట్టించుకోనున్నబాలీవుడ్ నటుడు

Published Sat, May 17 2014 8:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సినిమా కోసం గుండు కొట్టించుకోనున్నబాలీవుడ్ నటుడు - Sakshi

సినిమా కోసం గుండు కొట్టించుకోనున్నబాలీవుడ్ నటుడు

ముంబై: కొత్త సినిమా బాజీరావు మస్తానీ కోసం రణ్‌వీర్ సింగ్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఇది చరిత్రాత్మక పాత్ర కావడంతో బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మరాఠీ వీరుడు బాజీరావులా సహజంగా కనిపించడానికి గుండు కొట్టించుకోవడంతోపాటు మరాఠీ నేర్చుకుంటున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణే ప్రధాన జోడీగా నటిస్తుందని బాలీవుడ్ సమాచారం.  బాజీరావు పీశ్వా 18వ శతాబ్దానికి చెందిన మరాఠీ రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యవహారాల్లోనూ నిపుణుడిగా చెబుతారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తుందట.

 

దీపిక, ప్రియాంక నటిస్తున్నప్పటికీ, వీరిద్దరిలో మస్తానీ పాత్ర ఎవరు చేస్తారో ఇప్పటికీ తెలియరాలేదు. సినిమా షూటింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం మరికొన్నినెలల్లో  సెట్స్ పై వెళ్లే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రణవీవర్ తెలిపాడు. తనకు ఈ చిత్రం ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement