నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే | Ready To Indefinite hunger strike | Sakshi
Sakshi News home page

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే

Published Wed, Apr 19 2017 12:38 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే - Sakshi

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే

‘‘తెలుగులో చిన్న సినిమాల నిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సెన్సార్‌ జరిగినా థియేటర్ల సమస్యలతో తమ సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించకపోతే నిర్మాతలు, టెక్నిషియన్లతో కలసి నిరవధిక నిరహారదీక్ష చేస్తాం’’ అన్నారు తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌.

ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. నలుగురు నిర్మాతల గుప్పెట్లో థియేటర్లు ఉన్నాయి. వాళ్లు డిజిటల్‌ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని చిన్న నిర్మాతలను ముంచుతు న్నారు. థియేటర్ల లీజ్‌ సిస్టమ్‌ వల్ల చిన్న సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు’’ అన్నారు. ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని   టీఎఫ్‌సీసీ కార్యదర్శి సాయివెంకట్, తెలంగాణ ఆర్టిస్టుల సంఘం కార్యదర్శి జేవీఆర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement