హీరోతో సింగర్‌ ప్రేమాయణం‌! | rising star who has won over big-name directors in love with taylor swift | Sakshi
Sakshi News home page

హీరోతో సింగర్‌ ప్రేమాయణం‌!

Published Wed, May 17 2017 11:35 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

హీరోతో సింగర్‌ ప్రేమాయణం‌!

హీరోతో సింగర్‌ ప్రేమాయణం‌!

అమెరికన్‌ పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ ప్రేమలో పడింది. బ్రిటిష్‌ స్టార్‌ జోయ్‌ అల్వైన్‌తో స్విఫ్ట్‌ ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. జోయ్‌కు దగ్గర ఉండేందుకు ఉత్తర లండన్‌లోని అతని ఇంటికి చేరువలో ఓ ఇంటిని స్విఫ్ట్‌ అద్దెకు తీసుకుందట. కొద్దిరోజులుగా లండన్‌ వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది.

స్కార్ఫ్‌లు, హ్యాట్స్‌ ధరించి వీధుల్లో తిరుగడం వల్ల వీరిని ఎవరూ గుర్తు పట్టలేకపోయారని తెలిపింది. ఇరు కుటుంబాలకు వీరి ప్రేమాయణం గురించి కొద్ది నెలల కిందే తెలుసని వివరించింది. 2016లో బిల్లీ లిన్స్‌ లాంగ్‌ హాఫ్‌ టైమ్‌ వాక్‌ సినిమాలో జోయ్‌ నటించాడు. టేలర్‌ స్విఫ్ట్‌ 2016 గ్రామీ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement