'ట్రూ బ్లడ్'లో స్కార్సగార్డ్, రియాన్ క్వాంటెన్
లాస్ ఏంజెలెస్: రియాన్ క్వాంటెన్ బాగా చుంబిస్తాడని స్వీడిష్ నటుడు అలెగ్జాండర్ స్కార్సగార్డ్ అన్నాడు. అధర చుంబనంలో హీరోయిన్లు కంటే అతడే బెస్ట్ అని కితాబిచ్చాడు. 'ది లెజెండ్ ఆఫ్ టార్జాన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆస్ట్రేలియా టీవీ షో 'ది ప్రాజెక్టు'లో అలెగ్జాండర్ పాల్గొన్నాడు.
మీతో పాటు నటించిన ఆస్ట్రేలియా నటుల్లో ఎవరు బెస్ట్ కిస్సర్ అని ప్రశ్నించగా... హీరోయిన్లు మార్గొట్ రూబీ, నికోల్ కిడ్ మాన్ కంటే నటుడు రియాన్ క్వాంటెన్ బెస్ట్ అని సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రియాన్ క్వాంటెన్ చాలా సున్నిత మనస్కుడని అన్నాడు. 2014లో వచ్చిన 'ట్రూ బ్లడ్' సినిమాలో రియాన్ క్వాంటెన్, అలెగ్జాండర్ స్కార్సగార్డ్ శృంగార సన్నివేశంలో నటించారు.