హాలీవుడ్ ‘డెడ్‌పూల్’ సినిమా హీరో ర్యాన్ రెనాల్డో పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితులు సహా ఎంతో మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వాటన్నింటిలో ర్యాన్ భార్య బ్లేక్ లైవ్లీ తెలిపిన విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. తామిద్దరం కలిసిన ఉన్న ఫోటోకి బ్లేక్ జత చేసిన ట్యాగ్ నవ్వులు పూయిస్తోంది. బ్లేక్ తన భర్త ర్యాన్ ముక్కు దగ్గర వేలు పెడుతూ ఉన్న ఫోటోకి ‘ఉత్తమమైనదే నేను ఎంచుకున్నాను, హ్యాపీ బర్త్ డే ర్యాన్’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. బ్లేక్ షేర్ చేసిన ఈ ఫోటోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒక్కరోజులోనే 40 మిలియన్ల లైక్‌లు కొట్టి ఆమెపై అభిమానం చాటుకున్నారు.
ఈ పోస్ట్ చూసిన బ్లేక్ సోదరి ‘క్రస్టీ వన్ ఆల్‌రైట్’ అంటూ ఆకుపచ్చ హార్ట్ ఎమోజీతో సరదాగా కామెంట్ చేసింది. అలాగే ర్యాన్‌తో కలిసి ‘హిట్‌మ్యాన్స్ బాడిగార్డ్’ మూవీలో నటించిన సల్మా హాయక్ కూడా ర్యాన్‌ను తన భార్య బ్లేక్ తరహాలోనే ఆటపట్టించింది. ఇక హాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరొందిన ర్యాన్ , బ్లేక్‌లు 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment