Ryan Reynolds Wishes Sandra Bullock With Hugging Video On Her Birthday; Video Viral - Sakshi
Sakshi News home page

Sandra Bullock: హీరోయిన్‌కు అసభ్యకరంగా బర్త్ డే విషెస్.. ఏకంగా ఆ వీడియోతో!

Published Thu, Jul 27 2023 6:40 PM | Last Updated on Thu, Jul 27 2023 6:53 PM

Ryan Reynolds Wishes Sandra Bullock With Hugging Video On Birthday - Sakshi

హాలీవుడ్‌ నటికి ఊహించని విధంగా షాకిచ్చాడు ఆమె సహా నటుడు. జూలై 26న ఆమె బర్త్‌ డే సందర్భంగా విష్ చేసిన తీరు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా అతని వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. హాలీవుడ్ భామ సాండ్రా బుల్లక్ 59వ బర్త్‌ డే సందర్భంగా నటుడు ర్యాన్ రెనాల్డ్స్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ పోస్ట్‌లో ఏముందో తెలుసుకుందాం.

(ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్)

హాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే హీరోయిన్లలో సాండ్రా బుల్లాక్ ఒకరు. ఆమె తన 59వ పుట్టినరోజును జూలై 26న బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సైతం విషెస్ తెలిపారు. హాలీవుడ్‌లోని పరిశ్రమలోని అనేక మంది స్నేహితులు, సహానటులు  విష్ చేశారు. కానీ.. ఆమె సహా నటుడు ర్యాన్ రెనాల్డ్స్ పోస్ట్ తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆమెకు విష్ చేస్తూ వాళ్లిద్దరు 2009లో కలిసి నటించిన ది ప్రపోజల్ సినిమాలోను ఓ నగ్న వీడియోను పోస్ట్ చేశారు.  

ర్యాన్ రెనాల్డ్స్‌ ఇన్‌స్టాలో రాస్తూ...'  అసమానమైన, అద్భుతమైన ప్రతిభ కలిగిన సాండ్రా బుల్లక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ పుట్టినరోజు కోసం నేను మా ఇద్దరికీ సాన్నిహిత్యానికి సంబంధించిన సమన్వయకర్తలను పొందా. వారిలో ఒకరు హెచ్‌ఆర్ విభాగం, రెండోది దుస్తులు?' అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

గతంలో సాండ్రా బుల్లక్, ర్యాన్ రెనాల్డ్స్ నటించిన 'ది ప్రపోజల్' ఒక బాస్, ఉద్యోగి ప్రేమ ప్రయాణం కథాంశంగా తెరకెక్కించారు. గతంలో బుల్లక్ ఒకసారి 'ది ప్రపోజల్'లో నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించడం వెనుక ఏమి జరిగిందో పంచుకున్నారు. ఇది చాలా "క్లోజ్డ్ సెట్" అని.. ఈ సీన్‌లో.. అవసరమైనప్పుడు మేకప్ ఆర్టిస్టులు తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదని ఆమె చెప్పింది. ఆ సీన్‌లో మా ప్రైవేట్ భాగాలను చర్మం రంగులతో కప్పేసినట్లు సాండ్రా బుల్లక్ తెలిపింది. 

(ఇది చదవండి: నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్‌ ఫోటో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement