సచిన్, బాలీవుడ్ తారల కబడ్డీ కోలాహలం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ.. ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిస్తే కనులపండుగే. ఈ అరుదైన సన్నివేశానికి కబడ్డీ లీగ్ వేదికైంది.
ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా వీరిందరూ ఒక చోట చేరారు. అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు. బచ్చన్ ఫ్యామిటీ మొత్తం తరలివచ్చింది. జైపూర్ ఫ్రాంచైజీ యజమాని అయిన అభిషేక్.. సచిన్ను ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.