కష్టపడుతున్న సూపర్‌స్టార్‌ కూతురు! | sai dhanshika do exercise early morning | Sakshi
Sakshi News home page

కష్టపడుతున్న సూపర్‌స్టార్‌ కూతురు!

Published Sat, Jan 6 2018 5:35 PM | Last Updated on Sat, Jan 6 2018 5:35 PM

sai dhanshika do exercise early morning - Sakshi

సాయి ధన్సిక ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కబాలి చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీ కూతురుగా నటించి, తన అందంతో ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమా రిలీజైన తర్వాత అంతటా తన గురించే వార్తలు. ఇంతకీ ఎవరీమ్మాయి? అని కోలీవుడ్‌, టాలీవుడ్‌ అంతా ఆరాతీసింది. 

ఈ చిత్రంలో ధన్సిక తన స్టైల్‌, నటనతో అందరిని ఆకట్టుకుని మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ భామ వ్యాయామం చేసిన వీడియో ఒకటి సోషల్‌ హల్‌చల్‌ చేస్తోంది. ధన్సిక ‘ఉదయం పూట వ్యాయామం చేస్తే చాలా బాగుంటుందని, నేను జిమ్నాస్టిక్స్‌ కూడా చేస్తున్నాను’ అని తన ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘వాలుజడ’, తమిళ్‌లో మరో సినిమాను కూడా చేస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement