ఆ బాబుకు సమంత రెండో తల్లి..! | Samantha With Neeraja Kona Son | Sakshi
Sakshi News home page

ఆ బాబుకు సమంత రెండో తల్లి..!

Published Sun, May 15 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

ఆ బాబుకు సమంత రెండో తల్లి..!

ఆ బాబుకు సమంత రెండో తల్లి..!

హీరోయిన్గా ఎంతటి స్టార్ స్టేటస్ ఉన్నా చిన్న పిల్లలను చూడగానే తను కూడా చిన్న పిల్లగా మారిపోతుంది స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారను ఉద్దేశించి ఇంట్రస్టింగ్ ట్వీట్లతో ఆకట్టుకున్న సమంత,  తరువాత జనతా గ్యారేజ్ సెట్లో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్తో కలిసి సందడి చేసింది. తాజాగా సమంత ఓ బాబును ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఆ బాబుకు సమంత రెండో తల్లి అన్న వార్త అభిమానుల్లో మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరనుకుంటున్నారా..? సమంత పర్సనల్ స్టైలిస్ట్, ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరి అయిన కోన నీరజ కొడుకు అన్ష్. ఖాలీ సమయాల్లో ఎక్కువగా నీరజతోనే కలిసి ఉండే సమంత ఆమె కొడుకుకు కూడా చాలా దగ్గర అయ్యిందట. అందుకే నీరజ సరదాగా అన్ష్కు నువ్వు రెండు తల్లివి అంటూ సమంతను ఉద్దేశించి కామెంట్ చేస్తోంది.

ఇటీవల తేరి, 24 సినిమాలతో మంచి విజయాలు సాధించిన సమంత ప్రస్తుతం బ్రహ్మోత్సవం తో పాటు అ ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధిస్తే సౌత్ ఇండస్ట్రీలో సమంత నెంబర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement