
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మున్నాభాయ్ కొత్త సినిమా అంగీకరించాడు. ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారు. తనకెంతో ఇష్టమైన కామెడీ జానర్‌లో మల్టిస్టారర్ చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని సంజయ్ అన్నాడు. కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని మున్నాభాయ్ వ్యాఖ్యానించాడు.
మూవీ డైరెక్టర్ అజయ్ అరోరా మాట్లాడుతూ.. సంజయ్ సినిమాలతో పరిచయమైన డైరెక్టర్లు రాజ్‌కుమార్, డేవిడ్ ధవన్ వంటి వారు విజయవంతంగా దూసుకెళ్తున్నారు. నా కెరీర్‌ను సంజయ్ సినిమాతో స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. బ్లాక్‌బస్టర్ షూటింగ్ అంతా మారిషస్‌లోనే జరగనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. హిట్ చిత్రాలుగా నిలిచిన గోల్‌మాల్, హౌస్‌ఫుల్2, ధమాల్ రిటర్న్స్ సినిమాలకు రచయితగా పనిచేసిన సాజిద్ ఫర్హాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment