
సీనియర్ నటి జమీలా మాలిక్(73) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె కేరళ పాలోడ్‌లో తన కుమారుడు అన్సార్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. కొల్లాంలో జన్మించిన జమీలా.. తల్లి ప్రోద్భలంతో పుణే ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో విద్యార్థిగా చేరారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి కేరళ మహిళగా నిలిచారు.
ఆ తర్వాత 1972లో ‘ ఆద్యతే కథ’ చిత్రం ద్వారా జమీలా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పలు మలయాళం, తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఆమె.. సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. పలు హిందీ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. దివంగత జయలలిత కూడా కలిసి నటించారు. అయితే 1983లో వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత భర్తతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment