
‘డ్రైవర్ రాముడు’ సినిమా పేరు వినగానే ఎన్టీఆర్ గుర్తుకురాకమానరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ‘డ్రైవర్ రాముడు’ పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాజ్ సత్య తెరకెక్కిస్తున్నారు.
ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రాజ్ సత్య మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులకు నవ్వులు పంచిన శంకర్‌లోని మరో కొత్త కోణాన్ని మా సినిమాలో చూస్తారు. శంకర్ టైప్ వినోదంతో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారి బ్లాక్ బస్టర్ ‘డ్రైవర్ రాముడు’ టైటిల్‌ని మా సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం.
శంకర్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని వంద శాతం అలరిస్తారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇప్పటివరకూ నన్ను కమెడియన్‌గా ఆదరించిన ప్రేక్షకులు హీరోగానూ ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌గారి గెటప్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ బాగుందంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు శంకర్. ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్, సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: అమర్ నాద్.
Comments
Please login to add a commentAdd a comment