
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన శివ జ్యోతి అంటే ఎవరికీ తెలియకపోయినా.. తీన్మార్ సావిత్రి అంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొస్తుంది. తెలంగాణలో తీన్మార్ వార్తలు ఎంత ఫేమస్ అయిందో.. సావిత్రి(శివ జ్యోతి) కూడా అంతే ఫేమస్ అయింది. సావిత్రక్కగా వీక్షకుల్లో అభిమానం సంపాదించుకున్న ఈమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి తీన్మార్ వార్తల్లో రాకుండా.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు.
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. తన అభిమాన గణాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌లో నిత్యం టచ్‌లో ఉన్నారు. వార్తలు చదువుతూ, సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే సావిత్రి.. తెలంగాణ యాసలో ఆకట్టుకోవడం ప్రధాన బలం. మరి సావిత్రి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా తోటి కంటెస్టెంట్ల అభిమానంతో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ.. చివరి వరకు నిలిచి విన్నర్‌గా నిలుస్తుందా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment