
ఎట్టకేలకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఏం మ్యాచ్ అంటే బ్యాడ్మింటన్ మ్యాచ్ అన్నమాట. ఫలితాలు మాత్రం ఇప్పుడే రావు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైనా’. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
‘సైనా’ బయోపిక్‌కు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ‘‘సైనా నెహ్వాల్ కంట్రీస్ స్వీట్‌హార్ట్. చాంపియన్. ఒక యూత్ ఐకాన్. ఆమె జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆమె బయోపిక్‌లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రద్ధ.
Comments
Please login to add a commentAdd a comment