ది హౌస్ నెక్ట్స్ డోర్! | Siddharth And Andrea In The House Next Door | Sakshi
Sakshi News home page

ది హౌస్ నెక్ట్స్ డోర్!

Published Sat, Jun 11 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

ది హౌస్ నెక్ట్స్ డోర్!

ది హౌస్ నెక్ట్స్ డోర్!

ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ మూడు, నాలుగేళ్లుగా తమిళ చిత్రాలకే పరిమితమయ్యారు. అనువాద చిత్రాల ద్వారా మాత్రమే ఈ మధ్య తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఓ త్రిభాషా చిత్రంలో నటించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. వయాకామ్ 18తో కలిసి ఇటాకీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ నిర్మించనున్నారు. ఇందులో సిద్ధూ సరసన ఆండ్రియా కథానాయికగా నటించనున్నారు. మూడు భాషలకు చెందిన ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటిస్తారు. మిలింద్ రావ్ దర్శకత్వంలో ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ‘ది హౌస్ నెక్ట్స్ డోర్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘‘ఇది చాలా ఎగ్జయిటింగ్ మూవీ’’ అని ిసిద్ధార్థ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement