నో రింగ్.. నో కామెంట్స్!
బంటీ సచ్‌దేవ్.. ఇటీవల బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఎవరీ అబ్బాయి అంటే.. సల్మాన్‌ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ బ్రదర్ ఇన్‌లా. పలువురు సినిమా తారలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బంటీ సచ్‌దేవ్‌తో సోనాక్షి సిన్హా ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఓ అడుగు ముందుకేసి, నిశ్చితార్థం కూడా జరిగిందంటున్నారు. పార్టీలు, పబ్బుల్లో వీరిద్దరూ కలసి కనిపించడంతో ఈ రూమర్లు నిజమే అనుకుంటున్నారట.
తాజా ఇంటర్వ్యూలో బంటీ సచ్‌దేవ్‌తో మీ నిశ్చితార్థం జరిగిందట కదా? అనే ప్రశ్న సోనాక్షి ముందుంచితే.. ‘‘ఏవండీ... సరిగ్గా చూడండి. నా వేలికి ఉంగరం (ఎంగేజ్‌మెంట్ రింగ్) ఏమైనా మీకు కనిపిస్తోందా? లేదు కదా? మీ ప్రశ్నకు సమాధానం లభించినట్టేనా? ఇక దీనిపై నో కామెంట్స్’’ అన్నారు.