ఆన్లైన్లో రజనీకాంత్ 'కోచడయాన్' పాట హల్చల్ | SP Balasubramanyam sung first song from Rajinikanth 'Kochadaiiyaan' was released | Sakshi

ఆన్లైన్లో రజనీకాంత్ 'కోచడయాన్' పాట హల్చల్

Oct 7 2013 5:16 PM | Updated on Sep 1 2017 11:26 PM

ఆన్లైన్లో రజనీకాంత్ 'కోచడయాన్' పాట హల్చల్

ఆన్లైన్లో రజనీకాంత్ 'కోచడయాన్' పాట హల్చల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కోచడయాన్‌' చిత్రంలోని తొలిపాట ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కోచడయాన్‌' చిత్రంలోని తొలిపాట ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన 'ఎంగె పొగుదో వానమ్' పాటను సోమవారం విడుదల చేశారు. ఈ పాటను వైరముత్తు రచించగా, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ స్వరాలు అందించారు. రజనీపై ఎనర్జిటిక్గా రూపొందించిన ఈ గీతానికి రెహ్మాన్ మెలోడీ టచ్ ఇచ్చి అద్భుతంగా రూపొందించారు.

రజనీకాంత్ చిత్రానికి రెహ్మాన్ సంగీతమందించడమిది ఆరోసారి. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, రష్యా, జపాన్, చైనా భాషలలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని 3డిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  అద్భుతంగా నిర్మిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement