బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర
ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఓ ఫైనాన్సియల్ కంపెనీ మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. తన అకౌంట్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా 1.18 లక్షల రూపాయల డబ్బును మరో అకౌంట్‌కు ట్రాన్స్‌పర్ చేసినట్టుగా గుర్తించిన శ్రీలేఖ సదరు ఫైనాన్సియల్ కంపెనీపై కస్బా పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.
దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు గతంలో శ్రీలేఖ అదే ఫైనాన్సియల్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. అయితే శ్రీలేఖ ఆ లోన్ తిరిగి చెల్లించనట్టుగా చెపుతున్నా.. ఆలోన్ కోసమే నెలకు 6000 రూపాయలు ఫైనాన్సియల్ కంపెనీ శ్రీలేఖ బ్యాంక్ అకౌంట్ ను డెబిట్ చేసినట్టుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment