రూ.50 లక్షలు చెల్లించలేదు | Sridevi demands her 50 Lakhs from 'Puli' makers | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలు చెల్లించలేదు

Published Sun, Nov 8 2015 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

రూ.50 లక్షలు చెల్లించలేదు

రూ.50 లక్షలు చెల్లించలేదు

* పులి చిత్ర నిర్మాతపై శ్రీదేవి ఫిర్యాదు
తన పారితోషికానికి సంబంధించి రూ.50 లక్షలు చెల్లించలేదని నటి శ్రీదేవి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి శ్రీదేవి. 1980 ప్రాంతంలో దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా ఏలిన ఆమె ఆ తరువాత బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. అక్కడా ప్రముఖ కథానాయకిగా రాణించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుని ముంబాయిలో సెటిల్ అయ్యారు. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.

సుమారు 25 ఏళ్ల తరువాత తమిళంలో విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో రాణిగా ప్రధాన పాత్ర పోషించారు. పీటీ.సెల్వకుమార్, శిబూ తమీన్స్ సంయుక్తంగా నిర్మించారు. శింబుదేవన్ దర్శకుడు. ఇందులో నటించడానికి శ్రీదేవి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడా పారితోషికంలో రూ.50 లక్షలు ఇంకా బాకీ ఉన్నట్లు చిత్రం విడుదలయ్యి నెలలు అవుతున్నా బాకీ పారితోషికం చిత్ర నిర్మాతలు చెల్లించలేదని శ్రీదేవి ముంబాయి సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

అందులో ఆమె పులి చిత్ర నిర్మాతలకు పలు సార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని, తన బాకీ పారితోషికాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీదేవి ఫిర్యాదును ముంబాయి నిర్మాతల మండలి తమిళ సినీ నిర్మాతల మండలికి పంపింది. ఇప్పుడు తమిళ సినీ నిర్మాతల మండలి శ్రీదేవి ఫిర్యాదుపై విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement