Rs 50 lakh
-
బస్సులో రూ.50 లక్షల స్వాధీనం
మదురై : చెన్నై నుంచి మదురైకు బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలలో నగదు బట్వాడాను అడ్డుకునే దిశగా ఎన్నికల కమిషన్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్‌కాల్ వచ్చింది. చెన్నై నుంచి మదురైకు వస్తున్న బస్సులో రూ. 50 లక్షల నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు చెప్పి ఆగంతకుడు ఫోన్ చేశారు. ఆ వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. మేలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి పీర్ మహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ కలెసైల్వి, హెడ్కానిస్టేబుల్వ్రి సహా పోలీసు బృందం చిట్టంపట్టిలోగల టోల్గేట్ వద్ద కాపు కాసి.. సదరు బస్సును నిలిపి అధికారులు తనిఖీలు జరిపారు. బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద గల ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో వెయ్యి, 500ల రూపాయల కట్టలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.... అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించి... విచారణ చేపట్టారు. చెన్నై సెంబాక్కంకు చెందిన తన పేరు రాధా (56) అని... స్థానిక హోటల్లో పని చేస్తున్నానని అతడు పోలీసుల విచారణలో తెలిపాడు. అతని యజమాని ఈ సొమ్మును మదురైకు తీసుకెళ్లి అక్కడ ఒక వ్యక్తికి ఇవ్వమన్నాడని చెప్పాడు. సొమ్ముకు తగిన ఆధారాలు లేకపోవడంతో రూ.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని మదురై జిల్లా ట్రెజరీలో అప్పగించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు స్వాధీనం చేసుకున్న సొమ్మును పరిశీలించారు. -
రూ.50 లక్షలు చెల్లించలేదు
* పులి చిత్ర నిర్మాతపై శ్రీదేవి ఫిర్యాదు తన పారితోషికానికి సంబంధించి రూ.50 లక్షలు చెల్లించలేదని నటి శ్రీదేవి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఎవర్గ్రీన్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి శ్రీదేవి. 1980 ప్రాంతంలో దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా ఏలిన ఆమె ఆ తరువాత బాలీవుడ్లో రంగప్రవేశం చేశారు. అక్కడా ప్రముఖ కథానాయకిగా రాణించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుని ముంబాయిలో సెటిల్ అయ్యారు. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. సుమారు 25 ఏళ్ల తరువాత తమిళంలో విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో రాణిగా ప్రధాన పాత్ర పోషించారు. పీటీ.సెల్వకుమార్, శిబూ తమీన్స్ సంయుక్తంగా నిర్మించారు. శింబుదేవన్ దర్శకుడు. ఇందులో నటించడానికి శ్రీదేవి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడా పారితోషికంలో రూ.50 లక్షలు ఇంకా బాకీ ఉన్నట్లు చిత్రం విడుదలయ్యి నెలలు అవుతున్నా బాకీ పారితోషికం చిత్ర నిర్మాతలు చెల్లించలేదని శ్రీదేవి ముంబాయి సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అందులో ఆమె పులి చిత్ర నిర్మాతలకు పలు సార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని, తన బాకీ పారితోషికాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీదేవి ఫిర్యాదును ముంబాయి నిర్మాతల మండలి తమిళ సినీ నిర్మాతల మండలికి పంపింది. ఇప్పుడు తమిళ సినీ నిర్మాతల మండలి శ్రీదేవి ఫిర్యాదుపై విచారించనుంది. -
నేనిచ్చిన లక్ష..రూ.50లక్షలు కావాలి...
రుణమాఫీపై మహిళలతో సీఎం బాబు వ్యాఖ్య సాక్షి, అనంతపురం: ‘‘ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష రుణం మాఫీ చేశాను.. మాఫీ అయ్యే రూ.లక్షను మీ భర్తల చేతికివ్వద్దు.. మీరే ఆ సొమ్ముతో వ్యాపారాలు చేసి రూ.50 లక్షలు సంపాదించాలి. మరో నాలుగు నెలల తర్వాత నేను మళ్లీ జిల్లాకు వస్తాను.. అప్పుడు రూ.లక్షతో రూ.50 లక్షలు ఎలా సంపాదించాలో చెపుతా’’నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం సీఎం అనంతపురం జిల్లాకు వచ్చారు. తొలిరోజు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ఎనుములపల్లి క్రాస్ మైదానంలో డ్వాక్రా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖితో పాటు నల్లమాడ, కదిరి రూరల్ మండలం కొండమనాయనిపల్లెల్లో మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్లున్నాయి కానీ 60 శాతం మంది ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో వీటిని పూర్తి స్థాయిలో నిర్మిస్తాం’’ అని బాబు చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులు పుస్తకాల బరువును మోయకుండా ఉండేందుకు వీలుగా విద్యార్థికో ఐప్యాడ్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సైతం సెల్ఫోన్ల స్థానంలో ఐప్యాడ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు. -
9 టెలికాం కంపెనీలకు ట్రాయ్ జరిమానా