బాహుబలి ప్లస్ | SS Rajamouli's 'Baahubali Plus | Sakshi
Sakshi News home page

బాహుబలి ప్లస్

Published Sun, Jul 12 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

బాహుబలి ప్లస్

బాహుబలి ప్లస్

 బిగ్‌స్టోరీ
 ఫస్ట్ పార్ట్ చివరలో...
 కొత్తగా సెకండ్ పార్ట్ టీజర్ షాట్స్?

  ‘బాహుబలి’... గడచిన వారం రోజులుగా తెలుగునాట చర్చ అంతా ఈ సినిమా గురించే! సినీ ప్రియుల నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపనివారి దాకా అందరూ ‘బాహుబలి’ గురించే మాట్లాడేలా చేయడంలో చిత్ర మార్కెటింగ్ టీమ్ వ్యూహం సక్సెసైంది. ఇటీవల ఏ సినిమాకూ రానంత హైప్ క్రియేట్ చేయడంలో మీడియా పాత్రా పెద్దదే. దానికి తగ్గట్లే సినిమా టికెట్లను అసలు ధర కన్నా చాలా ఎక్కువకు అధికారికంగానే బ్లాక్‌లో విక్రయించడమూ జరిగింది. అసలే ఎక్కువ హాళ్లలో రిలీజైన ఈ సినిమా ఈ అధికారిక బ్లాక్ రేట్ల విషయంలోనే కాక, ఫస్ట్‌డే కలెక్షన్లలోనూ మునుపటి రికార్డులను తిరగరాసింది.
 
 తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే...
 చిత్ర బడ్జెట్ లాగే, ఈ ఫస్ట్ డే కలెక్షన్ల గురించీ రకరకాల అంకెలు సోషల్ మీడియా మొదలు మెయిన్‌స్ట్రీమ్ మీడియా దాకా అంతటా ప్రచారమవుతున్నాయి. అంకెలగారడీ ఏమైనా, ప్రపంచమంతా కలిపి తెలుగు వెర్షన్ వరకు తొలిరోజు నికర వసూళ్ళు (ట్యాక్స్ పోగా మిగిలే షేర్) 27 కోట్ల దాకా వచ్చినట్లు సినీ వ్యాపార వర్గాల విశ్వసనీయ సమాచారం. సీడెడ్ (రాయలసీమ) ఏరియాలోనే రూ. 4 కోట్ల పైగా, నైజామ్‌లో 5 కోట్ల పైగా, ఆంధ్రాలో 9 కోట్ల పైగా షేర్ వచ్చినట్లు కథనం. అమెరికా సంగతికొస్తే, సాధారణంగా అక్కడ టికెట్ రేట్ ఆరేడు డాలర్లు, పెద్ద సినిమాల ప్రీమియర్‌కు 12 డాలర్లుంటుంది. అక్కడా ‘బాహుబలి’ ఫస్ట్‌డే టికెట్ 20 నుంచి 25 డాలర్లు పెట్టారు. ఆ దెబ్బతో ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని కలెక్షన్స్ ‘బాహుబలి’కి దక్కాయి.
 
 భయపడ్డట్లే... నెట్‌లో పైరసీ హల్‌చల్
 టికెట్ రేట్ల దెబ్బతో పైరసీని ఆశ్రయించేవారూ పెరిగారు. తెలుగు, తమిళ స్ట్రెయిట్ వెర్షన్స్‌తో పాటు హిందీ, మలయాళ డబ్బింగ్‌లు కూడా శుక్రవారం రిలీజైన ‘బాహుబలి... ది బిగినింగ్’ పైరసీ ఇప్పటికే ఇంట ర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దురదృష్టవశాత్తూ, చిత్రం హిందీ వెర్షన్ పైరసీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అందుబాటులోకొచ్చింది. పైరసీ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని యూనిట్, సినీ పరిశ్రమ ప్రకటించినా పైరసీ జరుగుతుండడం గమనార్హం.
 
 జనం టాక్ ఏమిటంటే...
 ఫస్ట్ డే కలెక్షన్స్, పైరసీ గడబిడ మాట ఇలా ఉంటే, ఆడియన్‌‌స టాక్‌ది మరో కథ. ప్రతి సినిమా లానే ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా... ఇండియా సినిమా’గా ప్రచారమైన ‘బాహుబలి’ గురించీ పరస్పర భిన్నమైన టాక్ వినపడుతోంది. ‘ఇలాంటి అద్భుతమైన సినిమా ఇప్పటిదాకా చూడలేదు’ అని ఒకటి, ‘ఆశించినంత గొప్పగా లేదు’ అని మరొకటి - ఇలా రెండు పరస్పర భిన్నస్పందనలు వినిపిస్తున్నాయి. ఈ టాక్‌కు కారణం - మిగిలిన అంశాలతో పాటు, ‘బాహుబలి’ ఫస్ట్‌పార్‌‌ట అర్ధం తరంగా ముగిసినట్లు ఉండడమని కొందరి అభిప్రాయం. మామూలుగా రాజమౌళి తన చిత్రాల చివర్లో వాటి ‘మేకింగ్’ దృశ్యాల్ని చూపెడతారు. ‘బాహుబలి’కీ అలా చేసుంటే బాగుండేదని కూడా కొందరంటున్నారు.
 
 రిలీజైన రెండోరోజే... కొత్త దృశ్యాల చేర్పు!
 ఈ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకునో ఏమో.. చిత్ర దర్శక, నిర్మాతలు ‘బాహుబలి’ సెకండ్ పార్‌‌టలోని కొన్ని దృశ్యాలను (టీజర్ షాట్స్) ఈ ఫస్ట్‌పార్‌‌ట చివర్లో క్రెడిట్స్ తర్వాత శనివారం నుంచి కలిపారు. ఫస్ట్‌పార్‌‌ట రిలీజైన రెండోరోజు సాయంత్రానికే ‘క్యూబ్’ ప్రింట్లలో వీటిని చేర్చారు. ఆ మేరకు చిత్ర ప్రచార ప్రతినిధి ట్వీట్ చేశారు. పి.ఎక్స్.డి, యు.ఎఫ్.ఒ లాంటి ఇతర డిజిటల్ ప్రింట్లలో ఆదివారం ఈ కలపడం పూర్తి కావచ్చు. కాగా, కొత్త దృశ్యాల్ని కలపడానికి కారణమేమిటో చిత్రయూనిట్ ప్రకటించలేదు. సమాచారానికై యత్నించినా, అందుబాటులోకి రాలేదు. క్రేజ్ తేవడానికీ, చూసినవారిని మళ్ళీ హాళ్ళకు రప్పించడానికీ ఇది ఓ స్ట్రేటజీ అనే వాదన కూడా వినిపిస్తోంది.
 
 మళ్లీ సెన్సార్ అయిందా?
 ఒక సినిమాలో కొత్త దృశ్యాల్ని అదనంగా కలిపినా, పాతవాటిని తీసేసినా ఆ ప్రభావమున్న రీలు వరకైనా సెన్సార్‌బోర్‌‌డకు చూపి, మును పిచ్చిన పాత సెన్సార్ సర్టిఫికెట్‌ను టెక్నికల్‌గా మళ్ళీ ‘ర్యాటిఫై’ (ఖాయం చేయడం, ధ్రువపరచడం) చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెన్సార్ పరిభాషలో ‘ర్యాటిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫి కెట్’ (లేదా ‘ఎండార్‌‌సమెంట్’) అని అంటారు. అయితే, ‘బాహుబలి’ ఫస్ట్‌పార్‌‌టకి ఇప్పటివరకు అదేమీ జరగలేదని సమాచారం. ‘‘ఇంతవరకూ నాకు తెలిసి మా దగ్గరకు ఆ అదనపు చేర్పుతో ఎవరూ రాలేదు. పాత సర్టిఫికెట్‌కు మళ్ళీ ఆమోద ముద్ర వేయించుకోలేదు’’ అని హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్‌‌డ ఆఫీసర్‌గా బాధ్యతలు చూస్తున్న టి.వి.కె. రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. చట్టబద్ధమైన ఈ అంశాలెలా ఉన్నా, ఏ కొత్త దృశ్యాలైనా ఈ ‘బాహుబలి’ మేనియోలో సినీప్రియులకు ఆనందం కలిగిస్తాయనడంలో డౌటేముంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement