నాలో ‘యాంగ్రీ మేన్’ అలానే ఉన్నాడు! | Still there is angry man in me! | Sakshi
Sakshi News home page

నాలో ‘యాంగ్రీ మేన్’ అలానే ఉన్నాడు!

Published Wed, Apr 9 2014 10:52 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

నాలో ‘యాంగ్రీ మేన్’ అలానే ఉన్నాడు! - Sakshi

నాలో ‘యాంగ్రీ మేన్’ అలానే ఉన్నాడు!

అమితాబ్ వయసు సెవెన్టీ ప్లస్. నటుడిగా ఆయన వయసు ఫార్టీ ఫ్లస్. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో అమితాబ్ బచ్చన్ పలు రకాల పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘యాంగ్రీ యంగ్ మేన్’ పాత్రల్లో ఆయన ఒదిగిపోయిన వైనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏడు పదుల వయసులో ఈ తరహా పాత్రలు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ విషయం గురించి అమితాబ్ స్పందిస్తూ - ‘‘స్కూల్, కాలేజ్ డేస్‌లో ఉండే ఎనర్జీ శాశ్వతంగా మనతో ఉండదు. అది వాస్తవమే. నేనొకప్పుడు ‘యాంగ్రీ యంగ్ మేన్’ పాత్రలను సునాయాసంగా చేసేవాణ్ణి. రిస్కీ ఫైట్స్‌ని అవలీలగా చేసేవాణ్ణి. ఇప్పుడు చేయలేను.
 
 ‘యంగ్' గా లేకపోయినా కానీ, నాలో యాంగ్రీ మేన్ మాత్రం అలానే ఉన్నాడు. యాంగ్రీ అంటే.. కేవలం ఫైట్స్ చేయడం మాత్రమే కాదు. దర్శకులు  శక్తిమంతమైన డైలాగ్స్ చెప్పించి, యాంగ్రీ మేన్‌ని బయటికి తీసుకురావచ్చు. ఒకవేళ అలాంటి కేరక్టర్‌తో ఏ దర్శకుడైనా వస్తే.. ఇన్నాళ్లూ ఫైట్స్ చేసి నాలో యాంగ్రీ మేన్‌ని చూపించాను. ఇప్పుడు మరో కోణంలో చూపిస్తా’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement