ఇంక్విలాబ్ ఏ హీరో పేరో తెలుసా? | Story Behind Amitabh Bachchan Name | Sakshi
Sakshi News home page

ఇంక్విలాబ్ ఏ హీరో పేరో తెలుసా?

Published Sun, Aug 13 2017 12:17 PM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

ఇంక్విలాబ్ ఏ హీరో పేరో తెలుసా?

ఇంక్విలాబ్ ఏ హీరో పేరో తెలుసా?

ముంబై: స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపు తెస్తూ బ్రిటీష్ వారిని దేశం వదిలిపోవాలంటూ నినదించిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ మధ్యే సరిగ్గా 75 ఏళ్లు పూర్తయ్యింది. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ప్రముఖ రచయిత హరివంశ్ రాయ్‌ శ్రీవాస్తవను అమితంగా ఆకర్షించిది. అందుకే తనకు పుట్టబోయే కొడుకుకు ఇంకిల్వాబ్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 
 
అక్టోబర్‌ 11 అంటే క్విట్ ఇండియా మొదలైన రెండు నెలల తర్వాత ఆయన భార్య తేజి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఇంక్విలాబ్ అనే పేరు పెట్టాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలో రాయ్‌ స్నేహితుడు సుమ్రితానందన్‌ పంత్ బాలుడిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చారు.
 
చిన్నారిని చూస్తూ ధన్యావస్త్‌ అమితాబ్‌ అన్నారు. అనుకోకుండా ఆయన నోటి నంచి వచ్చిన పదం హరివంశ్ రాయ్‌ని విపరీతంగా ఆకర్షించింది. వెంటనే తన కొడుకుకు అమితాబ్ అని పేరుపెట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బిగ్ బీ అమితాబ్ పేరు వెనుక అసలు కథే ఇది. యాధృచ్ఛికం ఏంటేంటే.. ఇంకిల్వాబ్ పేరుతోనే 1984లో అమితాబ్‌ శ్రీదేవి జంటగా బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. 
 
బచ్చన్‌ ఎలా అయ్యారు... 
 
అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్‌ శ్రీవాస్తవను చిన్నప్పుడు ఇంట్లో అందరూ ముద్దుగా బచ్చన్‌(చిన్నపిల్లాడు) అని పిలిచేవారు. తర్వాత ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పై చదువుల కోసం వెళ్లినప్పుడు అడ్మిషన్‌ ఫామ్‌లో బచ్చన్‌ అనే నమోదు చేయించుకున్నారు. అదే తర్వాత అమితాబ్ పేరు వెనకాల వచ్చి చేరి స్థిరపడిపోయి, బచ్చన్‌ ఫ్యామిలీకి రిఫరెన్స్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement