
‘సమ్మోహనం’ లాంటి కూల్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత చాలా గ్యాప్ తీసుకుని పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రాన్ని చేశాడు. తాజాగా మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌ను స్థాపించి, ఆ సంస్థలో మొదటి సినిమాగా నన్నుదోచుకుందువటే చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. సుధీర్ బాబుకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆర్‌ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment